వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ

57చూసినవారు
వాహనాలు తనిఖీ చేసిన ఎస్ఐ
రోడ్లపై వాహనాల నడిపేవారు తప్పనిసరిగా తమ వెంట వాహనానికి సంబంధించిన పత్రాలు ఉంచుకోవాలని చెరుకుపల్లి ఎస్సై అనిల్ కుమార్ సూచించారు. శుక్రవారం చెరుకుపల్లి ఐలాండ్ సెంటర్లో వాహనాల తనిఖీ చేపట్టారు. ట్రిపుల్ రైడింగ్, అధిక లోడ్లతో వెళ్తున్న వాహనాలకు అపరాధ రుసుం విధించారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే ఆ వాహనాన్ని సీజ్ చేస్తామని ఎస్ఐ అనిల్ కుమార్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్