గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని శాంతిభద్రతలు పరిరక్షించటమే పల్లె నిద్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం రాత్రి నిజాంపట్నం మండలం ముత్తు పల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో రేపల్లె రూరల్ సీఐ సురేష్ బాబు, ఎస్ఐ తిరుపతిరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.