సత్తెనపల్లి డిఎస్పీగా హనుమంతరావు

79చూసినవారు
సత్తెనపల్లి డిఎస్పీగా హనుమంతరావు
సత్తెనపల్లి డిఎస్పీగా మెదరమెట్ల హనుమంతరావు బుధవారం విధుల్లో చేరారు. 1991 ఎస్ఐ బ్యాచ్ కి చెందిన ఈయన సత్తెనపల్లి, గుంటూరు కొత్తపేట, పెద్దకాకాని, నరసరావుపేట, పిడుగురాళ్ల స్టేషన్లలో ఎస్ఐ గా పని చేశారు. అదేవిధంగా సీఐ గా పిడుగురాళ్ళ, గుంటూరు లాలాపేట, అమరావతి, నెల్లూరు జిల్లా గూడూరులో పని చేశారు. మూడేళ్ల క్రితం డిఎస్పీగా పదోన్నతి పొందిన ఈయన సాధారణ బదిలీపై సత్తెనపల్లి డీఎస్పీ గా విధులు నిర్వర్తించనున్నారు.

సంబంధిత పోస్ట్