సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ వద్ద సోమవారం బాధితులు ఆందోళన చేపట్టారు. నెల రోజులు గడుస్తున్న తమకు న్యాయం జరగలేదని బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ముత్తూట్ ఫైనాన్స్లో సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారం గోల్మాల్ జరిగినట్లు భాదితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు కడతామన్నా కూడా తమ బంగారం తమకు ఇవ్వడం లేదని బాధితులు వాపోతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.