సహకార సంఘాల కంప్యూటరైజేషన్ విషయంలో ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించాలని పల్నాడు జిల్లా పీఏసీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు ఆరాధ్యుడు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ. ఉద్యోగులపై పెరుగుతున్న ఒత్తిడితో చింతలపూడి సొసైటీ సీఈవో వెంకటస్వామి పని ఒత్తిడికిలోనై పెరాలసిస్ వ్యాది బారిన పడ్డారన్నారు. ఒత్తిడిని తగ్గించకపోతే ఆందోళనలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.