సత్తెనపల్లి రూరల్ రాజకీయాలకతీతంగా, నాయకులు విభేదాలను విస్మరించి గ్రామ అభివృద్ధికి ఐక్యంగా సమిష్టి కృషి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు అంబటి రాంబాబు సూచించారు. గురువారం మండలంలోని అబ్బూరు గ్రామంలో రెండవ రోజు కొనసాగిన గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఆయన ప్రభుత్వం ముద్రించిన కరపత్రాలను ఇంటింటికి తిరిగి అందించారు. ఆయనతో పాటు పూర్వ శాసనసభ్యులు యర్రం వెంకటేశ్వర రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.