తుళ్లూరు మండలంలో మందు బాబులు రెచ్చిపోయారు. శనివారం రాత్రి ఆర్టీసీ బస్ విజయవాడ నుంచి అమరావతికి కొంతమంది ప్రయాణికులతో బయల్దేరింది. దొండపాడు సమీపంలోకి రాగానే మద్యం తాగిన మందుబాబులు బస్సు పైకి రాయి విసిరారు. ఈక్రమంలో బస్ వెనుక వైపు అద్దం పగిలిపోయింది. ఈ ఘటనపై బస్సు డ్రైవర్, కండక్టర్ తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మందు బాబులను విచారిస్తున్నారు.