మహిళల సంరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీస్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని తాడికొండ మండల పరిధిలోని మహిళలు వినియోగించుకోవాలని సీఐ వాసు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాత్రి వేళల్లో మహిళలు ప్రయాణించే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటే వారిని గమ్య స్థానానికి చేర్చడమే ఈ ప్రధాన ఉద్దేశం అన్నారు. 9746414641 నంబర్ సేవ్ చేసుకోవాలన్నారు.