గుంటూరు: సంక్రాంతి పండుగకు ఇంటికి వస్తుండగా విషాదం

75చూసినవారు
సంక్రాంతి పండుగ వేళ కుటుంబంతో ఆనందంగా గడుపుతామని ఎన్నో ఆశలతో ఇంటికి వస్తున్న ఘటనలో విషాదం చోటు చేసుకుంది. మేడికొండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేరేచర్ల నగరవనం వద్ద శనివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన భాగ్య రమేశ్ (30) గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమేశ్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని గుంటూరు మార్చూరీకి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్