సీడ్ యాక్సెస్ రోడ్లో ఇసుక వాహనాలు నిలపరాదు: కలెక్టర్

68చూసినవారు
సీడ్ యాక్సెస్ రోడ్లో ఇసుక వాహనాలు నిలపరాదు: కలెక్టర్
ఇసుక రవాణా కోసం వస్తున్న వాహనాలను సీడ్ యాక్సిస్ రోడ్ లో అనవసరంగా నిలపకుండా నియంత్రణ చేపట్టాలని పోలీస్ అధికారులకు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. శుక్రవారం తుళ్లూరు మండలంలో కలెక్టర్ నాగలక్ష్మి, జేసీ భార్గవ్ తేజ, ఇన్ ఛార్జ్ గుంటూరు ఆర్డీవో గంగరాజుతో కలసి సీడ్ యాక్సిస్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డుపై వాహనాలు నిలపకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్