ఆలిండియా ముస్లిం లా బోర్డు సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రి ఎన్ఎండి ఫరూఖ్, మండలి మాజీ ఛైర్మన్ షరీఫ్ సహా పార్టీ మైనారిటీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం వెలగపూడి సచివాలయంలో కలిశారు. వక్స్ యాక్ట్ సవరణపై కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై తమ అభ్యంతరాలు తెలిపారు.