తాడికొండ తహాశీల్దార్ గా పనిచేస్తున్న నాసరయ్యకు డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి రావడంతో బుధవారం ఆత్మీయ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఈ మేరకు స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు నాసరయ్య ను ఘనంగా సత్కరించారు. ఈ మేరకు తాడికొండ మండలంలో ఈయన అందించిన సేవలను కొనియాడారు.