తుళ్ళూరులో ద్విచక్రవాహనం చోరీ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు పెదకాకాని మండలం నంబూరు గ్రామానికి చెందిన దివాకర్ వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. స్వల్ప గాయాలు కాగా కాసేపటీ తర్వాత చూసేసరికి అతని బైక్ కనిపించలేదు. దీంతో బాధితుడు తుళ్ళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.