సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పై సోషల్ మీడియాలో రాంగోపాల్ వర్మ అసభ్యకరంగా పోస్టులు పెట్టారని పెదపరిమి గ్రామానికి చెందిన నూతలపాటి రామారావు ఫిర్యాదు చేశాడు. గేదెల ముఖాలకు వీరి ఫొటోలు పెట్టి అవమానించారని వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.