కేంద్ర సహకార బ్యాంకులో కంప్యూటరైజ్డ్ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం తుళ్లూరు మండలం కోపరేటివ్ సొసైటీ బ్యాంకులో అధికారులు కంప్యూటర్లకు సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్యాంకులోని డేటాను కంప్యూటరైజ్డ్ చేసేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.