తుళ్ళూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు వచ్చే రూట్, సబ్ స్టేషన్ ప్రారంభం, కార్య క్రమం అనంతరం సభ, భోజనాల ఏర్పాట్లు వద్ద వేరువేరుగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చెప్పారు.