వాహనాలకు సంబంధించి తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తుళ్ళూరు సీఐ అంజయ్య తెలిపారు. ఆదివారం సాయంత్రం తుళ్ళూరులో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బైక్ నడుపుతున్న వారు హెల్మెట్, కారు నడిపేవారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. రోడ్లపై రాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పలు వాహనాలకు చలానాలు విధించారు.