అమెరికాలో తెనాలికి చెందిన వైద్యురాలి మృతి

62చూసినవారు
అమెరికాలో తెనాలికి చెందిన వైద్యురాలి మృతి
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెనాలికి చెందిన యువ వైద్యురాలు మృతి చెందారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతా నగర్ కు చెందిన హారిక పశువైద్యరాలు. ఎంఎస్ చేయడానికి ఆమె గత ఏడాది ఆగస్టులో అమెరికాకు వెళ్లారు. ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మృతిచెందారు. భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వస్థలానికి తీసుకొచ్చేందుకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నారై లతో సంప్రదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్