పుస్తక పఠనం వలన పరిజ్ఞానం పెరుగుతుందని మండల విద్యా శాఖ అధికారి సాల్మన్ పేర్కొన్నారు. చుండూరు శాఖా గ్రంధాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, డాన్స్ తదితర పోటీలను బుధవారం నిర్వహించారు. గ్రంథాలయాధికారి భాగ్యలత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం ఎంపీటీసీ శ్రీనివాస్ రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.