ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు పంపిణీ

82చూసినవారు
ఈ నెల 12 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్న సందర్భంగా ముందుగా జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు భట్టిప్రోలు మండల పరిషత్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం ఆవరణలో మండల స్తాయిలోని మహిళలతో ముగ్గుల పోటీలు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలస్థాయి అధికారుల చేతుల మీదుగా విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు పచ్చతోరణాలు కట్టి విద్యుత్ దీపాలతో అలంకరించారు.

సంబంధిత పోస్ట్