వేమూరు నియోజకవర్గంలోని ఇరిగేషన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని వేమూరు శాసన సభ్యులు నక్కా ఆనందబాబు అధికారులను ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో గురువారం ఇరిగేషన్ శాఖా అధికారులు తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వేమూరు నియోజకవర్గంలో ఇరిగేషన్ వర్క్ ల స్టేటస్ ను సమీక్షించారు. ఇంకా మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.