తెనాలి మండలంలోని పెదరావూరు శాఖా గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు బుధవారం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కాకి రమాదేవి ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ జీడీ సీసీ బ్యాంకు చైర్మన్ యం. సీతారామయ్య, పంచాయతీ కార్యదర్శి పి. దానయ్య, ఉపాధ్యాయులు, గ్రంథాలయ అధికారి పాల్గొన్నారు.