బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడీ సూచనల మేరకు చట్టవిరుద్ధమైన కార్య కలాపాలను నిరోధించడానికి నిరంతరం అప్రమత్తతతో చుండూరు మండల వ్యాప్తంగా పోలీసులు రాత్రి సమయాల్లో గస్తీ పెంచారు. ప్రధానంగా రోడ్డు ప్రమాదాల నివారణకు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి వాహన తనిఖీలను కఠినతరం చేయడంపై దృష్టి సారించినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.