ఈ నెల 12 వతేదీన కొల్లూరు లో జరిగే ప్రజా గళం సభను జయప్రదం చేయాలిని కోరుతూ మండల కేంద్రం అమృతలూరు లోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గురువారం అమృతలూరు మండల టిడిపి, జనసేన పార్టీల సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రజాగళం సభకు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్న క్రమంలో జన సమీకరణలో భాగంగా మాజీమంత్రి నక్కా ఆనంద బాబు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అమృతలూరు మండలం నుండి అధిక సంఖ్యలో పాల్గొనలన్నారు.