రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్పందించారు. సోమవారం క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేసారు. సూపర్ సిక్స్ పథకాల అమల్లో భాగంగా మరో రెండు పథకాలైన తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించండం హర్షించదగినదని ఎమ్మెల్యే తెలిపారు. ఇది పేద ప్రజల బడ్జెట్ అని ఆయన కొనియాడారు.