రషీద్ ఇంటి సమీపంలో కొనసాగుతున్న బందోబస్తు

57చూసినవారు
వినుకొండ పట్టణంలో గత నెల 17న వైసీపీ కార్యకర్త రషీద్ ను జిలాని అనే యువకుడు నడిరోడ్డుపై విచక్షణారహితంగా అత్యంత దారుణంగా కత్తితో నరికి హత్య చేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు జిలానితో సహా 10 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో సోమవారం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రషీద్ ఇంటి సమీపంతో సహా మూడు ప్రాంతాల్లో పోలిస్ పికెట్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్