ఓటమి భయంతో బొల్లా బ్రహ్మనాయుడు బీఎల్ఎలను, ఎన్నికల అధికారులను ఒత్తిళ్లకు గురిచేసి టిడిపి సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారని పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. వినుకొండ స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులను తన ఇంటికి, పిలిపించుకొని తమకు అనుకూలంగా పనిచేయకపోతే బదిలీ చేస్తానని చెప్పడం సరికాదన్నారు.