వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెం శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం సంభవించిన సంగతి విధితమే. ఈ ప్రమాదంలో బస్సు ఢీకొని 30 గొర్రెలు మృతి చెందగా, పలు గొర్రెలు గాయపడ్డాయి. ఈ ఘటనలో గొర్రెలను ఇంటికి తరలిస్తున్న తిరుపతయ్య (18) కూడా అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి ఆర్టీసీ బస్సును పోలిస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు.