మహిళల ఆర్థిక ప్రగతి కూటమితోనే సాధ్యం: ఎమ్మెల్యే జీవీ

70చూసినవారు
మహిళల ఆర్థిక ప్రగతి కూటమితోనే సాధ్యం: ఎమ్మెల్యే జీవీ
మహిళలు వారి కాళ్లపై నిలబడి ఆర్థిక ప్రగతి సాధించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మంగళవారం వినుకొండలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. మహిళా సంఘాల సభ్యులు తయారుచేసిన వివిధ రకాల వస్తువులు, పిండి వంటలు, వస్త్రాలు, బొమ్మలు, ఆహార పదార్థాలను ఎమ్మెల్యే పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన, మున్సిపల్ కమిషనర్ సుభాష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్