తన ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ముంబై నటికి వేధింపుల కేసులో తన పేరు ప్రస్తావించడంపై ఆయన సీరియస్ అయ్యారు. 'హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ అసత్య కథనాలను రాయిస్తోంది. వైసీపీ నేతల వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తోంది. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నా' అని ఆయన ఫైర్ అయ్యారు.