'అసభ్య ప్రచారం చేస్తున్నాడని.. పెట్రోల్ పోసి తగలబెట్టింది'

52చూసినవారు
'అసభ్య ప్రచారం చేస్తున్నాడని.. పెట్రోల్ పోసి తగలబెట్టింది'
AP: పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. తనపై అసభ్య ప్రచారం చేస్తున్నాడని చిరంజీవి అనే యువకుడిపై ఓ యువతి పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటన క్రోసూరు మండలంలో వెలుగుచూసింది. సదరు యువకుడు గ్రామంలోని పలువురు యువతులపై కూడా గతంలో ఇలాగే ప్రచారం చేయడంతో గ్రామ పెద్దలు మందలించారని, అయినా తీరుమార్చుకోలేదని యువతి తెలిపింది. దీంతో విసిగిపోయి దాడి చేసినట్లు వెల్లడించింది. తీవ్రంగా గాయపడిన యువకుడు చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్