AP: రాష్ట్ర ప్రజల సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ వైద్య సేవను హైబ్రిడ్ విధానంలోకి విస్తరిస్తామన్నారు. బీమా, పీఎంజేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్ట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు రూ.2.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీని, పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.