TG: కోళ్లకు వైరస్ సోకుతున్న నేపథ్యంలో వ్యాపారాలు చికెన్ పకోడీ, గుడ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో బర్డ్ ఫ్లూ పట్ల ప్రజల్లో అపోహలను తొలగించేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఓ సంస్థ చికెన్ అండ్ ఎగ్ మేళాను ఏర్పాటు చేసింది. 200 కేజీల చికెన్, 2వేల గుడ్లతో ఫుడ్ తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేసింది. దీంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకొని చికెన్ వంటకాలు తినేందుకు బారులు తీరారు.