ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. లాహోర్ వేదికగా మధ్యాహ్నం ఈ మ్యాచ్ జరగనుంది. మంగళవారం జరగాల్సిన ఆసీస్, సౌతాఫ్రికా మ్యాచ్ వర్షం వల్ల ఆగిపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఈ క్రమంలో నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ భారీ విజయం సాధిస్తే గ్రూప్ -బి నుంచి సెమీస్ రేసులో ఉండొచ్చు.