పాకిస్తాన్ కరాచీ జైలు నుండి విడుదలైన తర్వాత 22 మంది భారతీయ జాలర్లు గుజరాత్‌లోని గిర్ సోమనాథ్‌కు చేరుకున్నారు. గుజరాత్‌లోని అరేబియా సముద్ర సరిహద్దు సమీపంలో చేపలు పడుతున్న ఈ మత్స్యకారులను ఏప్రిల్ 2021, డిసెంబర్ 2022 మధ్య పాకిస్తాన్ సముద్ర భద్రతా దళం అరెస్ట్ చేసింది. దాదాపు 200 మంది భారత జాలర్లు ప్రస్తుతం పాకిస్తాన్ జైళ్లలో ఉన్నట్లు సమాచారం.