ఏపీని వర్షాలు వీడటం లేదు. మరోసారి వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గుంటూరు, బాపట్ల, గోదావరి జిల్లాల్లో బుధవారం ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. అంబేద్కర్ కోనసీమ, తూ.గో జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. రాజమండ్రి నగరంతో పాటు అమలాపురం, మండపేట, పి.గన్నవరం, కొత్తపేట, రాజోలు, రాజానగరం, అనపర్తి, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురంలో వర్షం జోరుగా కురుస్తోంది. బాపట్ల జిల్లాలోని కృష్ణా నదీతీరంలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.