తమిళనాడులోని విరుదునగర్ జిల్లా అరుప్పుకోట్టై ప్రాంతంలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. పాతకక్షల కారణంగా కాళీకుమార్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతడి మృతదేహంతో బంధువులు నిరసన చేపట్టారు. నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అక్కడకు వెళ్లిన డీఎస్పీ గాయత్రిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆమె జుట్టు పట్టుకుని బాలమురుగన్ అనే వ్యక్తి లాగాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.