విజయవాడలో ఆకలి కేకలు

68చూసినవారు
విజయవాడలో ఆకలి కేకలు
ప్రకృతి కన్నెర్రజేస్తే మహా ప్రళయం తప్పదు. దానికి నిదర్శనమే బెజవాడ భయానకం. ఒక పక్క భారీ వర్షాలు, వరదలతో విజయవాడ వణుకుతోంది. మరోపక్క తినడానికి తిండి లేక ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం లక్షల ప్యాకెట్ల ఆహారం, పాలు, మంచినీళ్లు అందిస్తున్నా.. ప్రజల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తునే ఉన్నాయి. మూడు పూటల వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం అందించాలని విశేష కృషి చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం పంపిస్తున్న ఆహారం ప్రజలకు పంపిణీ చేయకుండా డబ్బులకు అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులు పాలు, ఆహారం అమ్ముతుంటే.. మరోపక్క బోట్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని బాధితులు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్