ఉత్తరప్రదేశ్‌లో ఓ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నాయకుడు తన భార్య, ముగ్గురు పిల్లలను తుపాకీతో కాల్చాడు. ఈ ఘటనలో ఇద్దరు ఆడ పిల్లలు మృతి చెందగా.. భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీజేపీ నాయకుడు మానసిక అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్లు వెల్లడించారు.