బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కొత్త సూపర్‌కార్ వాన్‌క్విష్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ కారు ఫీచర్లను పరిశీలిస్తే ఇందులో 5.2 లీటర్ల V12 ఇంజిన్‌ను ఉపయోగించింది. దీనికి 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. అలాగే ఈ కారు కేవలం 3.3 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 345 కి.మీ. ఇక దీని ధర విషయానికి వస్తే ప్రారంభ ధర రూ.8.85 కోట్లుగా కంపెనీ పేర్కొంది.