తిరుమలలో భారీ వర్షం

74చూసినవారు
AP: తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఘాట్ రోడ్డులో ఉన్న భ‌క్తులు, కొండ‌పైకి ద్విచ‌క్ర వాహ‌నాలపై వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వ‌ర్షం రావ‌డంతో భ‌క్తులు షెడ్ల కింద‌కు ప‌రుగులు తీశారు. ఇప్ప‌టికే ఏపీలోని ప‌లు జిల్లాల్లో వ‌ర్షం కురుస్తున్న సంగ‌తి తెలిసిందే. రాబోయే 24 గంట‌ల్లో రాష్ట్రంలో ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్