ఏపీలో భారీ వర్షాలు.. మంత్రి కీలక ఆదేశం

51చూసినవారు
ఏపీలో భారీ వర్షాలు.. మంత్రి కీలక ఆదేశం
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. ప్రజలకు నష్టం వాటిల్లకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ఏలూరు, అనకాపల్లి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్