రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని, నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ అద్భుతమైన సూక్ష్మచిత్రాలను సృష్టించారు. బియ్యపు గింజపై మైక్రో బ్రష్ ద్వారా అల్లాకు ప్రార్థన చేసే ఓ ముస్లిం వ్యక్తి, నెలవంక, నక్షత్రం వంటి అతి సూక్ష్మ చిత్రాలను వేయడం విశేషం. ఈ అద్భుత కళాఖండం చూసినవారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రంజాన్ వేళ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.