పరువు హత్యలతో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్న జంటలు ఆందోళన చెందుతున్నాయి. ‘ప్రేమించి ఇష్టమైన వారిని పెళ్లి చేసుకోవడమే చేసిన నేరమా’ అని వారు వాపోతున్నారు. పరువు హత్యలకు సాధారణంగా హత్య కేసుకు సంబంధించిన సెక్షన్ల కిందనే కేసులు నమోదు చేసి రిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి కేసులు కోర్టుల్లో విచారణకు వచ్చిన సందర్భాలో ఎక్కువ శాతం శిక్షలు పడకుండా రాజీ అవుతున్న ఘటనలూ ఉన్నాయి.