మేజర్ అయిన యువతీ, యువకులు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ అనంతరం ఒకటవుతున్నారు. కానీ, వీరి ప్రేమను తల్లిదండ్రులు విభేదిస్తున్నారు. ప్రేమలు కేవలం వ్యామోహం, ఆకర్షణలని తిరస్కరిస్తున్నారు. ప్రేమ పేరుతో వివాహాలు చేసుకున్న వారు జీవితంలో ఉన్నతంగా స్థిరపడిన సందర్భాలు తక్కువగా ఉంటున్నాయని కొంత మంది తల్లిదండ్రులు ప్రేమ వివాహాలను అంగీకరించడం లేదు. ప్రేమ వివాహం చేసుకుంటే చస్తామని మరి కొంతమంది తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు.