పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో త్యాగాలు చేసే తల్లిదండ్రులు వారు కోరుకున్న భాగస్వామిని ఎందుకు అంగీకరించలేకపోతున్నారు? సాధారణంగా చిన్నప్పుడు పిల్లలు తమకి నచ్చనివాటి విషయంలో చాలా స్పష్టంగా ఉంటారు. 'నాకిది ఇష్టం లేదు.. నాకిది వదు’ అని నిర్మోహమాటంగా చెబుతుంటారు. అప్పుడు పెద్దలు కూడా వారి ఇష్టాయిష్టాలను గమనిస్తూ.. వారిని సంతోషపెట్టడానికే చూస్తారు. అదే పెద్దయ్యాక తమకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటామంటే నోబుతారు.