ఏపీలోని నందిగామలో అఘోరీ వివస్త్రగా ఉన్న సమయంలో వర్షిణీ ముందుకొచ్చిన సాయం చేసింది. అనంతరం వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే అఘోరీ, వర్షిణీని గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లింది. అయితే, తమ కుమార్తెకు మాయమాటలు చెప్పి అఘోరీనే ఎత్తుకెళ్లాడంటూ వర్షిణీ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అక్కడ నుంచి వర్షిణీకి నచ్చజెప్పి తల్లిదండ్రులు తీసుకురాగా, మరలా వెళ్లిపోయింది.