తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఖండించారు. తానెప్పుడూ వైసీపీతోనే ఉంటానని స్పష్టం చేశారు. 'నేను విధేయత, అంకితభావం, నిబద్ధత కలిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తను. నేను వైసీపీలోనే ఉంటాను. వైఎస్ జగన్ నాయకత్వంలో పని చేస్తాను' అని ట్వీట్ చేశారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలు వైసీపీని వీడి కూటమి పార్టీల్లోకి చేరుతారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.