AP: రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో ఆయన మాట్లాడుతూ.. ‘వారసత్వంగా నాకు రూ.10 లక్షల కోట్ల అప్పు మాత్రమే వచ్చింది. అప్పులకు వడ్డీలు చెల్లించాల్సిన బాధ్యత నాపై ఉంది. సంక్షేమం, అభివృద్ధి సమానంగా చేస్తా. తల్లికి వందనం మేలో ఇస్తా. నాలుగు నెలలకు ఒకసారి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం.’ అని అన్నారు.