ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు అపార అవకాశాలు: సీఎం చంద్రబాబు

54చూసినవారు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ల ఏర్పాటుకు అపార అవకాశాలు: సీఎం చంద్రబాబు
ఏపీలో ఆహారశుద్ధి యూనిట్‌ల ఏర్పాటుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. సచివాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ, ఆహారశుద్ధి పరిశ్రమలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వాటికి చేయూత ఇస్తుందన్నారు. సవాళ్లతో దెబ్బతిన్న ఈ రంగాన్ని సరికొత్త విధానాల ద్వారా మళ్లీ గాడిన పెడతామని.. MSMEకి క్రెడిట్ గ్యారెంటీ కింద రూ.100 కోట్లు కేటాయిస్తామని సీఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్